English | Telugu
మోహన్ బాబుకు అల్లుడి కౌంటర్
Updated : Mar 21, 2014
మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో నటించిన "రౌడీ" ఆడియో విడుదల కార్యక్రమం నిన్న తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో అత్యంత వైభవంగా జరిగింది. అయితే మాములుగా మంచు లక్ష్మీ భర్త ఆనంద్ శ్రీనివాస్ ని ఫోటోల్లో చూడటమే తప్పితే ఆయన ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు. ఈ విషయం స్వయంగా మంచు లక్ష్మీ కూడా ఒప్పుకుంది.
అయితే ఈ వేడుకకు లక్ష్మీ తన భర్తతో విచ్చేసింది. ఈ వేడుకపై తన భర్తను అభిమానులకు పరిచయం చేసింది లక్ష్మీ. ఆ తర్వాత ఆనంద్ మాట్లాడుతూ... ''నాకు తెలుగు అంతగా రాదు.. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను.. అందుకే ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్'' అంటూ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అని ఇంగ్లీష్ లోచెప్పారు.
ఆనంద్ ప్రసంగం పూర్తయ్యాక మోహన్ బాబు మైక్ అందుకొని (ఆనంద్‌ని ఉద్దేశిస్తూ)...''ఇంతసేపూ ఆయన మా లక్ష్మీ వెనకాలే ఉన్నాడు. లక్ష్మీ అంటే అది. లక్ష్మీ అంటే గడ గడ'' అని అంటూ కామెంట్ చేసాడు. దీనిపై ఆనంద్ వెంటనే స్పందిస్తూ... ''లక్ష్మీ అంటే నాకేమీ గడగడ లేదు. మేమిద్దరం మ్యూచ్‌వల్ అండర్‌స్టాండింగ్‌లో ఉంటాం. అంతే తప్పు భయపడటం లాంటిదేమీ లేదు'' అంటూ మోహన్ బాబుకు ఝలక్ ఇచ్చాడు.