English | Telugu

ఇక బాహుబలి మొత్తం అక్కడేనంట !

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. మిగిలిన సన్నివేశాల కోసం రామోజీఫిల్మ్ సిటీలోని ఎం.సిటీ రాయల్ ఏరియాలో సెట్ వర్క్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్కలతో పాటుగా ప్రధాన తరాగణమంతా పాల్గొంటోంది. ఇప్పటికే విడుదలైన పలు మేకింగ్ వీడియోల వలన ఈ సినిమాపై ఉన్న అంచలనాలను మరింత పెంచాయి. 2015లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.