English | Telugu

మహేష్ ను వాడుకున్న అల్లరోడు

అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా 3డి చిత్రం "యాక్షన్". అనిల్ సుంకర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ సీన్ లో మహేష్ బాబు "వన్ నేనొక్కడినే" చిత్రం తాజా ట్రైలర్ ను వేయడంతో థియేటర్ లో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో జనాలు ఆ ట్రైలర్ కోసమైనా మళ్ళీ మళ్ళీ వచ్చి సినిమా చూస్తారని దర్శకుడు అలా చేసాడో ఏమో కానీ.. మొత్తానికి మహేష్ ట్రైలర్ వల్ల సినిమా ఓపెనింగ్స్ మాత్రం బాగానే వస్తున్నట్లుగా కనిపిస్తుంది.