English | Telugu

త్రివిక్రమ్ నిర్మాతగా కాంతార తరహాలో కొరగజ్జ.. ఎక్కడి దైవమో తెలుసా! 

-కొరగజ్జ కథ ఏంటి?
-త్రివిక్రమ్ ఏం చెప్తున్నాడు
-తుళునాడు నేపధ్యం ఏంటి
-భారీ అంచనాలు

కన్నడ సినీ సీమలో తెరకెక్కిన కాంతార,కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)సృష్టించిన ప్రభంజనం అందరకి తెలిసిందే. ఇప్పట్లో ఆ రెండు చిత్రాల తాలూకు ప్రభావాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు మర్చిపోవడం అనేది కొంచం కష్టమే. ఇప్పుడు కాంతార తరహాలోనే మరో సాంస్కృతిక ఆధారిత మూవీ 'కొరగజ్జ' (koragajja)పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావడానికి వడివడిగా ముస్తాబవుతోంది. కర్ణాటక లోని తులునాడు ప్రాంతంలో అత్యంత పవిత్రంగా పూజించబడే దైవమే కొరగజ్జ. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి మంచి పేరు వచ్చింది. దీంతో కొరగజ్జ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. త్రివిక్రమ్(Trivikram)సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్లపై త్రివిక్రమ్ నిర్మిస్తుండగా సుధీర్ అత్తవర్(Sudheer Attavar)దర్శకుడు. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

రీసెంట్ గా మంగళూరులో ఆడియో లాంఛ్ కార్యక్రమం జరిగింది. నటీనటులందరు కొరగజ్జ సంప్రదాయ గెట‌ప్‌లతో కనిపించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత త్రివిక్రమ్ మాట్లాడుతు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్, 3D మోషన్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. కంటెంట్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతు 'కన్నడ పరిశ్రమలో పాన్ వరల్డ్ సినిమాలు దశాబ్దాల క్రితమే వచ్చాయి. ‘నాగరహోలి’13 భాషల్లో విడుదలైంది. 'కాంతార’కూడా ఒక గొప్ప కల్చరల్ ప్రెజెంటేషన్. ఇప్పడు మా నుంచి ‘కొరగజ్జ' రాబోతోంది. తులునాడు సంస్కృతి, పూజా సంప్రదాయాన్ని మరో కోణంలో చూపించే ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు.

also Read: కాంత లో ప్రధాన హైలెట్స్ ఇవే అంటున్న ప్రేక్షకులు

సందీప్ సొపర్‌కర్, శృతి, భవ్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం 'కొరగజ్జ' పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి కాంతార సిరీస్ తరహాలోనే 'కొరగజ్జ' కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సాదిస్తుందేమో చూడాలి.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.