English | Telugu

బాలకృష్ణ, ప్రభాస్‌ మధ్య పోటీ తప్పదా?.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ అప్‌డేట్‌!

- సంక్రాంతి బరిలో ముగ్గురు టాలీవుడ్ హీరోలు

- అఖండ2 పోస్ట్‌పోన్ అనే వార్తలో నిజమెంత?

- రాజాసాబ్ మళ్లీ పోస్ట్‌పోన్ అవుతుందా?

త కొంతకాలంగా స్టార్‌ హీరోల సినిమాలేవీ అనుకున్న టైమ్‌కి రిలీజ్‌ అవ్వడం లేదు. ఒక రిలీజ్‌ డేట్‌ ఎనౌన్స్‌ చేసిన తర్వాత ఆ డేట్‌కే సినిమా రిలీజ్‌ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. అనేక సార్లు సినిమా రిలీజ్‌ని వాయిదా వేస్తున్నారు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే దాని వల్ల ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి సన్నగిల్లే అవకాశం కూడా ఉంది అనేది ట్రేడ్‌ వర్గాల అభిప్రాయం. గతంలో వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమాలు హిట్‌ అయిన సందర్భాలు చాలా తక్కువ. ప్రస్తుతం వాయిదా పడుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌లో నిర్మించిన సినిమాలు కావడంతో ఈ చర్చకు ప్రాధాన్యం పెరిగింది.

ఇప్పుడు రెండు పాన్‌ ఇండియా సినిమాల రిలీజ్‌లు అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ2’ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌ 25న రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. కానీ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌ ఉన్న కారణంగా డిసెంబర్‌ 5న సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కంప్లీట్‌ అయింది. అయితే ఇప్పుడు గ్రాఫిక్‌ వర్క్‌ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. దీంతో రిలీజ్‌ డేట్‌ మీద కూడా సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే మరో 20 రోజులు మాత్రమే టైమ్‌ ఉంది. కానీ, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చెయ్యలేదు. దీన్ని బట్టి ‘అఖండ2’ మరోసారి పోస్ట్‌ పోన్‌ అవుతుందన్న వార్తకు బలం చేకూరింది.

ఇక ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజాసాబ్‌’ చిత్రం పరిస్థితి కూడా అదే. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 5న రిలీజ్‌ చేయబోతున్నట్టు మొదట ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 9న సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు ఒక ట్రైలర్‌ ద్వారా తెలిపారు. ఇప్పుడు ‘అఖండ2’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే ‘అఖండ2’, ‘రాజాసాబ్‌’ చిత్రాల మధ్య భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.

మరో పక్క మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంటే సంక్రాంతికి మూడు భారీ సినిమాలు బరిలో ఉండబోతున్నాయని మాట వినిపిస్తోంది. అయితే ‘అఖండ2’ రిలీజ్‌ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను డిసెంబర్‌ 5న విడుదల చేస్తారనేది తాజా సమాచారం. సంక్రాంతికి చిరంజీవి, అనిల్‌ రావిపూడి సినిమా తప్పకుండా ఉంటుంది. మరి రాజాసాబ్‌ సినిమా రిలీజ్‌ మరోసారి వాయిదా పడుతుందనే వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.