English | Telugu

18న ప్రీమియర్...19న విడుదల

అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "కెవ్వు కేక". దేవి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోను జూలై 18న ప్రదర్శించనున్నారు. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం యొక్క పాటలు కూడా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. మరి ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.