English | Telugu
లిఫ్ట్ లో ఇరుక్కొని దర్శకుడి కుమారుడు మృతి.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్
Updated : Dec 16, 2025
-షాక్ కి గురవుతున్న భారతీయ చిత్ర పరిశ్రమ
-లిఫ్ట్ లో ఏం జరిగింది!
-పవన్ ట్వీట్ వైరల్
భారతీయ చిత్ర సీమలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని రీతిలో జరిగిన జరిగిన ఈ సంఘటన చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తుల్లోనే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాల్ని కలిచి వేస్తుంది. కేజిఎఫ్ సిరీస్ యష్, ప్రశాంత్ నీల్ కే కాకుండా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో 'కీర్తన్'(Kirtan)కూడా ఒకరు. ఈయన కేజిఎఫ్ సిరీస్ కి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా పని చేసాడు. రీసెంట్ గా కీర్తన్ కుమారుడు సోనార్ష్(Sonarsh)లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయాడు. పొరపాటున లిఫ్ట్ లో ఇరుక్కోవడం వల్లనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వయసు సుమారు రెండు సంవత్సరాలు.
దీంతో పలువురు సినీ ప్రముఖులు సోనార్ష్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సోనార్ష్ మృతి తనని తీవ్రంగా బాధించిందని ఎక్స్ వేదికగా తెలిపాడు. కొన్నిరోజుల క్రితమే ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి కీర్తన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని అనౌన్స్ చేసారు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అలాంటి ఈ టైంలో సోనార్ష్ మరణించడం అత్యంత బాధాకరమైన విషయం.కీర్తన్ స్వస్థలం బెంగుళూర్ కాగా నార్త్ బెంగళూరులోని రాజ్ మహల్ విల్లాస్ లో నివాసం ఉంటున్నాడు