English | Telugu

సుజిత్ కి పవన్ కళ్యాణ్ కారు గిఫ్ట్.. ఎన్ని కోట్లో తెలుసా

-చిన్నప్పట్నుంచి పవన్ అభిమాని
-ఎన్నో కోట్లు
-కారు మోడల్ ఏంటి


పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సినీ కెరీర్ ని చూసుకుంటే కొన్నిచిత్రాలకి అభిమానుల్లోనే కాకుండా పవన్ కి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి ఒక ప్రత్యేకత గల చిత్రమే ఓజి(OG). గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కగా ఈ ఏడాది సెప్టెంబర్ 25 న రిలీజై పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. పవన్ కి ఈ చిత్రం ద్వారా ఎంత పేరు వచ్చిందో దర్శకుడు సుజిత్ కి అంతే పేరు వచ్చింది. అంతలా పవన్ ని సరికొత్త ప్రెజెంటేషన్ తో చూపించాడు. పవన్ కూడా ఓజి విజయం తాలూకు క్రెడిట్ మొత్తాన్ని సుజిత్ కే ఇచ్చాడు. దీన్నిబట్టి పవన్ గుండెల్లో సుజిత్ కి ఉన్న స్థానాన్ని అర్ధం చేసుకోవచ్చు.


ఆ స్థానం యొక్క గొప్పతనాన్ని చాటుతు సుజిత్ కి పవన్ ఖరీదైన 'ల్యాండ్ రోవర్ డిఫెండర్'(Land Rover Defender)కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. సదరు కారుతో పవన్, సుజిత్(Sujeeth)దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక పవన్ తనకి కారుని గిఫ్ట్ ఇవ్వడంపై సుజిత్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'బాల్యం నుంచి పవన్ అభిమాని అయిన నేను ఈ రోజు ఆయన్నుంచి కారుని గిఫ్ట్ గా అందుకోవడం మాటల్లో చెప్పలేని సంతోషంగా ఉంది. నా ఓజి పవన్ కళ్యాణ్ ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికి మరువలేనివి. ఎప్పటికి ఆయనకి రుణపడి ఉంటా అని ట్వీట్ చేయడంతో పిక్స్ ని కూడా షేర్ చేసాడు. ఇక పవన్ ఇచ్చిన కారు ధర కోటి రూపాయలకి పైగానే ఉంటుంది.


also read: లిఫ్ట్ లో ఇరుక్కొని దర్శకుడి కుమారుడు మృతి.. ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్

సుజిత్ సినీ కెరీర్ విషయానికి వస్తే తన అప్ కమింగ్ మూవీని నాచురల్ స్టార్ నాని(Nani)తో చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అధికారంగా ఈ మూవీ ప్రారంభమైంది. నాని కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్.