English | Telugu

"హిట్టు..ఫ్లాపు"తో పని లేదు !!

అతనొక ఎమ్మెల్యేకి కొడుకు.. ఒక ఎమ్మెల్యేకి తమ్ముడు. అందుకే తను హీరోగా నటిస్తూ నిర్మించే చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఒకదాని తర్వాత మరొకటి తీస్తూ అందులో హీరోగా నటిస్తూనే ఉంటాడు. అతని పేరు కమలాకర్.

తాజాగా అతను టైటిల్ పాత్ర పోషిస్తూ నర్మిస్తున్న "బ్యాండ్ బాలు" పాటలు నిన్ననే విడుదలయ్యాయి. కమలాకర్ సరసన కామ్న జఠ్మలాని నటిస్తోంది. కమలాకర్ "అభి" అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత "సన్నీ", "సంచలనం", "హాసిని" అనే చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు తాజాగా "బ్యాండ్ బాలు". వీటిన్నిటికీ నిర్మాత కూడా ఆయనేనని ముందుగానే చెప్పుకున్నాం కదా. సినిమాకు సుమారుగా రెండు కోట్లు చొప్పున పోగొట్టుకుంటూ.. సంవత్సరానికి ఓ సినిమా తీస్తున్న కమలాకర్ హీరోగా సెటిలవ్వకపోయినా.. తెలుగు సినిమా హీరోల జాబితాలో తన పేరు నమోదు చేసుకునే ధృడమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడేమోననిపిస్తుంది!