వైభవంగా జరిగిన సమంత పెళ్లి.. వరుడు రాజ్ నిడమోరు
on Dec 1, 2025

సమంత పెళ్లి
వరుడు రాజ్ నిడమోరు
అభిమానులు హ్యాపీ
సమంత సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. షార్ట్ టైంలోనే అగ్ర హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందింది. సమంత కోసమే సినిమాకి వెళ్లేంత అభిమాన గణం కూడా తన సొంతం.ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడమోరు' తో సమంత రిలేషన్ లో ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే ఆ ఇద్దరు కలిసి పలు ప్రదేశాల్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.
ఈ రోజు రాజ్ తో సమంత వివాహం తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న'ఈశా యోగా సెంటర్' లో వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకకి హాజరయ్యారు. ప్రస్తుతం వివాహం తాలూకు పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. రాజ్ దర్శకత్వంలో సమంత మొదట 'ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ లో చేసింది. 2021 లో స్ట్రీమింగ్ కి రాగా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాజ్ దర్సకత్వంలోనే వచ్చిన 'సిటాడెల్ హనీ బన్నీ' అనే మరో వెబ్ సిరీస్ లో కూడా చేసింది.
also read: పెళ్లి చేసుకోవాలని నేను సలహా ఇవ్వను
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



