English | Telugu

100 కోట్లు అంట.. హిట్ అయితే ఇలాగే ఉంటుంది పరిస్థితి  

-స్పీడ్ పెంచేసింది
-కార్తీ సినిమాలో ఆఫర్
-మార్షల్ పై పెరిగిన అంచనాలు



కళ్యాణి ప్రియదర్శన్(Kalyani priyadarshan)..ఇప్పుడు ఇది పేరు కాదు బ్రాండ్. పాన్ ఇండియా వ్యాప్తంగా 'కొత్త లోక చాప్టర్ 1 'తో 300 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని అందుకొని బడా హీరోలకి సైతం షాక్ ఇచ్చింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా ప్రస్తుతం కళ్యాణి 'జెనీ' అనే మూవీలో చేస్తుంది. జయం రవి హీరో కాగా నెక్స్ట్ ఇయర్ మార్చి లో విడుదల కాబోతుందనేది టాక్. రీసెంట్ గా కళ్యాణి మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.

కార్తీ(Karthi)హీరోగా 'మార్షల్'(Marshal)అనే పీరియాడికల్ ప్రాజెక్ట్‌ ఒకటి తెరకెక్కుబోతున్న విషయం తెలిసిందే. తమిళ(Tamila)అనే కొత్త దర్శకుడు పరిచయమవుతుండగా సదరు చిత్రం గురించి అధికార ప్రకటన ఎప్పుడో వచ్చింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం అధికార ప్రకటన రాలేదు. రీసెంట్ గా సదరు చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. దీంతో కళ్యాణి ప్రియదర్శి కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నట్టుగా భావించవచ్చు. అలాగే కళ్యాణి రాకతో మార్షల్ ప్రాజెక్ట్ కి అదనపు క్రేజ్ వచ్చినట్టుగా అవుతుంది.

Also read: ధురంధర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రికార్డులే తరువాయి

సముద్ర తీర ప్రాంతాన్ని బేస్ చేసుకొని వాస్తవ సంఘటనల ఆధారంగా మార్షల్ రూపొందనుండగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ సుమారు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.