English | Telugu

కాళీగా ఉన్న కాజల్‌

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కల్యాణం సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కాజల్‌.. అయితే తొలి సినిమాతొ అంతగా గుర్తింపు సాదించలేకపోయినా రెండో సినిమా చందమామతో అందాల భామగా గుర్తింపు తెచ్చుకుంది..రామ్‌చరణ్‌ రాజమౌళి కాంభినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాలో చేసిన మిత్రవింద క్యారెక్టర్‌తో ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్‌ అందుకుంది.. తరువాత వరుసగా స్టార్‌ హీరోల సరసన నటిస్తూ లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది.. ఇలా మంచి ఫామ్‌లోనే కనిపించిన కాజల్‌ ఒక్కసారిగా అవకాశాలులేక డీలా పడిపోయింది.. నాయక్‌, బాద్‌షా లాంటి సినిమాలు మంచి సక్సెస్‌లు సాందించినా తరువాత మాత్రం ఈ భామకు ఒక్క అవకాశం కూడా రాలేదు.. బాలీవుడ్‌ లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్న కాజల్‌ కి అక్కడ కూడా ఫెయిల్యూర్స్‌ ఎదురయ్యాయి..



త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఎవడు సినిమాలో గెస్ట్‌ అపియరెన్స్‌ ఇస్తున్న కాజల్‌ చేతిలో తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.. ప్రస్థుతం తమిళ్‌లో కార్తీ, విజయ్‌లతో రెండు సినిమాల్లో నటిస్తున్న కాజల్‌ ఆ తరువాత ఏ సినిమాకు కమిట్‌ అవ్వలేదు.. స్టార్‌ హీరోయిన్‌గా ఓ రేంజ్‌ ఫామ్‌లో ఉన్న కాజల్‌ ఇలా ఒక్కసారిగా డీలా పడటంతో ఇక తన పని అయిపోయింది అంటున్నారు .. విశ్లేషకులు