English | Telugu

కె ర్యాంప్ రికార్డు కలెక్షన్స్.. దివాలి విన్నర్ నిజమేనా!

కిరణ్ అబ్బవరం దివాళి కానుకగా ఈ నెల 18 న' కె ర్యాంప్'(K Ramp)తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కుమార్ అనే క్యారక్టర్ లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)పెర్ ఫార్మెన్స్ బాగుండటంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి.

దీంతో కలెక్షన్స్ పరంగా కె ర్యాంప్ మంచి వసూళ్లనే రాబట్టే దిశగా దూసుకెళ్తుంది. అందులో భాగంగా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17.5 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. కిరణ్ అబ్బవరం కూడా ఎక్స్ వేదికగా అందుకు సంబంధించిన పోస్టర్ ని షేర్ చేసి బ్రేక్ ఎవెన్యూ అయ్యిందని, దివాలి విన్నర్ అనే పోస్టర్ ని షేర్ చేసాడు. మరి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్యూ అయ్యిందంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే కే ర్యాంప్ మంచి వసూళ్లు సాధించే చిత్రంగా నిలబడటం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి.

పైగా కె ర్యాంప్ కి ముందు రోజు విడుదలైన మిత్ర మండలి, తెలుసు కదా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోవడం కె ర్యాంప్ కి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. జైన్స్ నాని(Jains nani)దర్శకత్వ ప్రతిభతో పాటు హాస్య మూవీస్‌, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ నిర్మాణ విలువలు ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ యుక్తి తరేజా(Yukti Thareja)తో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.