English | Telugu

జటాధర తొలి రోజు కలెక్షన్స్ ఇవే!  హిట్ కొట్టాడా! 

-సుధీర్ బాబు హిట్ అందుకున్నాడా!
-తొలి రోజు కలెక్షన్స్ ఇవే
-సోనాక్షి సిన్హా అదనపు ఆకర్షణ

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకి వైవిధ్యమైన క్యారెక్టర్స్ తో అభిమానులని, ప్రేక్షకులని అలరించే హీరో సుదీర్ బాబు(Sudheer Babu). నిన్న మరో వైవిధ్యమైన మూవీ 'జటాధర'(Jatadhara)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కడంతో పాటు బాలీవుడ్ అగ్ర నటి సోనాక్షి సిన్హా 'ధన పిశాచి' అనే కీలక పాత్రలో కనిపించడం ఈ చిత్రం స్పెషాలిటీ. నార్త్ లో కూడా భారీ థియేటర్స్ లోనే విడుదలైంది.

ఇక ఈ చిత్రం మొదటి రోజు తెలుగు, హిందీ కలిపి 90 లక్షల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఈ మేరకు అన్నిమీడియా సంస్థలోను ఇదే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఒక రకంగా సుదీర్ బాబు ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే జటాధర 90 లక్షల మేర రాబట్టడం పర్లేదని చెప్పవచ్చు. టాక్ పరంగా చూసుకుంటే జటాధర ద్వారా సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమైందనే అభిప్రాయాన్ని మూవీ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ముందు ముందు ఎంత మేర కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.

Also Read: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే కలెక్షన్స్

మనుషులు చనిపోయినా కూడా ఆత్మల రూపంలో తిరుగుతుంటారనే వాదనని నమ్మని ఘోస్ట్ హంటర్ శివ గా సుదీర్ బాబు కనిపించాడు. కానీ శివకి నిజంగానే ఆత్మలు కనిపిస్తాయి. ధన పిశాచి సోనాక్షి సిన్హా తో పోరాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగే కథనాలు ఆసక్తిగానే ఉంటాయి. శిల్పా శిరోద్కర్, శ్రీనివాస్ అవసరాల, ప్రదీప్ రావత్ కథకి ముఖ్యమైన కీలక పాత్రల్లో కనిపించగావెంకట్ కళ్యాణ్(venkat Kalyan)దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.