ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే కలెక్షన్స్
on Nov 8, 2025

-ది గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది
-రష్మిక అద్భుతమైన నటన
-అల్లు అరవింద్ సమర్పకుడు
-తొలి రోజు ఇంతేనా!
మూవీ ఏదైనా సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ ని చాలా బలంగా ప్రదర్శించగల నటి రష్మిక(Rashmika Mandanna). అందుకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొంత కాలానికే పాన్ ఇండియా నటిగా తన స్థాయిని మరింతగా పెంచుకుంది. నిన్న పాన్ ఇండియా మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'(The GirlFriend)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు. మూవీ చూసిన అందరు రష్మిక నటనని మెచ్చుకుంటు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
ఇక ఈ మూవీ తొలి రోజు ఇండియాలో 1 .30 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినిమాని క్రేజ్ ఉన్న ఈ స్థాయి కలెక్షన్స్ ని రావడం పట్ల కూడా ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా నార్త్ అమెరికాలో 50K డాలర్లు వచ్చినట్లు ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. రష్మిక గత చిత్రాలతో పోల్చుకుంటే గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్స్ తక్కువ అని చెప్పాలి.
Also read: ఆర్యన్ మూవీ రివ్యూ
ఇక ఈ మూవీకి సంబంధించి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 14 కోట్ల రుపాయలకి దక్కించుకున్నట్లుగా టాక్ వినపడుతుంది.శాటిలైట్ రైట్స్ 7 కోట్ల రూపాయలు, ఆడియో రైట్స్ 3 కోట్ల రూపాయల వచ్చినట్టుగా కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి కనపడగా మరో హీరోయిన్ అను ఇమ్మానియేల్ కీలక పాత్రలో కనిపించింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించడంతో పాటు రష్మిక టీచర్ గా కనపడ్డాడు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి విద్య నొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



