English | Telugu

డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అచ్చియ్యమ్మ.. ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ లుక్‌ అదుర్స్‌!

- రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా‘పెద్ది’

- మోస్ట్ ఫెరోషియస్‌గా అచ్చియ్యమ్మ క్యారెక్టర్

- రెండు పోస్టర్స్‌లోనూ అదరగొట్టిన జాన్వీ

ఉప్పెన వంటి డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించబోతోందనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్‌. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అయినప్పటికీ సినిమాలో జాన్వీ లుక్‌ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు.

తాజాగా ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్‌ పేరును, ఆమె లుక్‌ను రివీల్‌ చేశారు. సినిమాలో ఆమె అచ్చియ్యమ్మ అనే పాత్రలో నటిస్తోంది. జాన్వీ లుక్‌కి సంబంధించిన రెండు పోస్టర్స్‌ను నవంబర్‌ 1న విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో విడుదలైన ఈ రెండు పోస్టర్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Also Read:‘అఖండ2’ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే.. బాలయ్య ప్రభంజనం సృష్టించడం ఖాయం!

‘పెద్ది’ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర చాలా ఫెరోషియస్‌గా ఉంటుందని తెలుస్తోంది. పెద్ది లవర్‌గా, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ విలేజ్‌ గర్ల్‌గా సినిమాలో కనిపిస్తుంది. ఓ పోస్టర్‌లో జీపు మీదెక్కి రెండు చేతులెత్తి కాన్వాస్‌ చేస్తున్న జాన్వీ, మరో పోస్టర్‌లో మైక్‌ పట్టుకొని పాట పాడటానికి రెడీగా ఉన్న సింగర్‌గా కనిపించింది.

Also Read: కెమెరా ముందుకి బాలకృష్ణ చిన్నకూతురు

స్పోర్ట్స్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. జాన్వీ కపూర్‌కి ఈ సినిమా డెఫినెట్‌ ఒక డిఫరెంట్‌ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు.