English | Telugu

ఐబొమ్మవన్‌తో ఇండస్ట్రీకి షాక్‌.. రంగంలోకి దిగిన పోలీసులు!

పైరసీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ, బప్పం టీవీలను ఎట్టకేలకు క్లోజ్‌ చేశారు పోలీసులు. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి పంపారు. ఐబొమ్మ సమస్య సమసిపోయేలా చేసిన పోలీసులను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అభినందిస్తున్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మవన్‌ అంటూ మరో వెబ్‌సైట్‌ పుట్టుకొచ్చింది. అయితే అందులో సినిమా ఈవెంట్స్‌, రివ్యూలు కనిపిస్తున్నాయి. వాటిని క్లిక్‌ చేస్తే మూవీ రూల్జ్‌ అనే పైరసీ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్‌ అవుతోందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఐబొమ్మవన్‌ అనే సైట్‌కి సంబంధించి పోలీసులు స్పందించారు. అందులోని కంటెంట్‌ని క్లిక్‌ చేయడం వల్ల మూవీరూల్జ్‌కి రీడైరెక్ట్‌ అవుతోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గురువారం ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని పైరసీ సైట్లకు సంబంధించిన అన్ని వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.

కొత్తగా పుట్టుకొచ్చిన ఐబొమ్మవన్‌ వెబ్‌సైట్‌కి ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్‌ వెబ్‌సైట్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. ఐబొమ్మ ఆగిపోలేదు అని చెప్పడం కోసమే ఐబొమ్మవన్‌ అనే వెబ్‌సైట్‌ను సృష్టించి ప్రేక్షకుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మరో పక్క మూవీ రూల్జ్‌, తమిళవన్‌ వంటి పైరసీ వెబ్‌సైట్లను బ్యాన్‌ చెయ్యాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు. ఇప్పటికే ఐబొమ్మను క్లోజ్‌ చేయించారు కాబట్టి త్వరలోనే మిగతా పైరసీ సైట్లపై కూడా పోలీసులు దృష్టి పెట్టే అవకాశం వుంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.