English | Telugu

వివాదంలో హైపర్ ఆది.. క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్

- నవ్వించే వాడు యోగి
- వివాదంలో హైపర్ ఆది
- ప్రముఖ నటిపై బాడీ షేమింగ్ కామెంట్స్
- దీపికా రంగరాజు ఫ్యాన్స్ ఆగ్రహం

నవ్వేవాడు బోగి, నవ్వించే వాడు యోగి అనేది పెద్దలు చెప్పిన సామెత. ఆ సామెత ప్రకారం తనదైన మాటల ప్రాసలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని నవ్విస్తు వస్తున్నాడు హైపర్ ఆది(Hyper Aadi). మరి ఈ లెక్కన ఆది ని కూడా యోగిగా భావించవచ్చు. ఆది ఒక ప్రోగ్రాం చేసినా గెస్ట్ గా వెళ్లినా సదరు ప్రోగ్రాంని ఆది కోసం చూసే వాళ్ళు ఎందరో. సిల్వర్ స్క్రీన్ పైకి కూడా అడుగుపెట్టి రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల 'కిష్కిందపురి' తో అలరించాడు.

ఆది ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ(EtV)లో ప్రసారమవుతున్నశ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో ప్రోగ్రాంలకి గెస్ట్ గా వెళ్తున్న విషయం తెలిసిందే. తోటి కంటెస్టెంట్స్ పై ఆది చేసే జోక్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. దీంతో ఆది పంచే ఎంటర్ టైన్ మెంట్ తో సదరు షోస్ కి స్పెషల్ ఎట్రాక్షన్ కూడా వచ్చింది. రీసెంట్ గా ఢీ డ్యాన్స్ షో కి సంబందించిన ప్రోమో ని నిర్వాహకులు రిలీజ్ చేశారు. సదరు ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య, కెమెరా‌మాన్ తో డ్యాన్స్ చేసిన వీడియో రిలీజయ్యింది. ఆది ఆ ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతు మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్‌గా 'గుండు అంకుల్ బండ ఆంటీ’ అని ఒక సినిమా తెరకెక్కిస్తాని అన్నాడు. ఆ మాటలకి ఇబ్బంది పడినట్టుగానే కావ్య ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

Also Read: మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల

ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆది బాడీ షేమింగ్ కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు కావ్య కి సారీ చెప్పి ఆది తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు. కావ్య అసలు పేరు దీపికా రంగరాజు(Deepika Rangaraju)కావ్యరోల్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శిస్తు అశేష అభిమానులని సంపాదించుకుంది.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.