English | Telugu

ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి? హరీష్ శంకర్ సూపర్ రిప్లై 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)హరీష్ శంకర్(Harish Shankar)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ పొలిటికల్ బిజీతో పాటు వేరే చిత్రాల కమిట్ మెంట్ ఉండటం వలన ఉస్తాద్ షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ఈ నెల 12 న విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఆ మూవీ ప్రమోషన్స్ తర్వాత పవన్ తన అప్ కమింగ్ సినిమాల షూటింగ్స్ ని కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.

రీసెంట్ గా హరీష్ శంకర్ మాట్లాడుతు 'ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జూన్ రెండో వారం నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పాడు.. దీంతో ఉస్తాద్ ని పవన్ స్పీడ్ గా పూర్తి చెయ్యాలనుకుంటున్నాడనే వార్తలకి బలం చేకూరినట్టయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్ అందులోని పవన్ డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఉస్తాద్ ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.