English | Telugu
ఆర్ఆర్ఆర్ ని మించిన బిజినెస్.. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్..!
Updated : Jun 3, 2025
తెలుగునాట తిరుగులేని క్రేజ్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సొంతం. పవన్ రాజకీయాలతో బిజీ అయినప్పటికీ, ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 12న 'హరి హర వీరమల్లు'తో పలకరించనున్న పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముఖ్యంగా పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సినిమా కావడంతో 'ఓజీ'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్టుగానే.. విడుదలకు ఇంకా చాలా సమయం ఉండగానే దిమ్మతిరిగే రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది.
'ఓజీ' సినిమా నైజాంలో ఏకంగా రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా నైజాంలో రూ.90 కోట్లకు పైగా బిజినెస్ ఒక్క పుష్ప-2 సినిమా మాత్రమే చేసింది. పుష్ప-2 మూవీ రూ.100 కోట్ల బిజినెస్ చేయగా, రూ.75 కోట్లతో ఆర్ఆర్ఆర్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. అలాంటిది ఇప్పుడు ఓజీ మూవీ.. ఆర్ఆర్ఆర్ మించిన బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్ హీరోయిన్.