English | Telugu

500 కోట్లమంది హనుమాన్ భక్తులు కదిలితే ఏంటి పరిస్థితి.. అప్పుడే అయిపోలేదు

-అరుదైన రికార్డు
-హనుమాన్ పవర్ కి నిదర్శనం
-గుల్షన్ కుమార్ రూపొందించాడు

హిందువులు హనుమంతుడు(Hanuman)ని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. కొలవడమే కాదు ఆయన పట్ల కృతజ్ఞత భావంతో ఉంటు నిత్యం హనుమాన్ చాలీసా(Hanuman Chalisa) వింటూ, చదువుతు ఆ రామదూత తమ పక్కనే ఉన్నట్టుగా భావిస్తుంటారు. ఇప్పుడు ఆ భక్తులు తమ ఆరాధ్య దైవం ఒడిలో ఒక రికార్డుని ఉంచారు.

ప్రముఖ టి సిరీస్(T Series)కంపెనీ యూ ట్యూబ్ లో 2011 మే 10 న హిందీ లాంగ్వేజ్ లో 'హనుమాన్ చాలీసా'వీడియో గీతాన్ని అప్ లోడ్ చేసింది. శ్రీగురు చరణి సరోజి అనే పల్లవితో స్టార్ట్ అయ్యి తొమ్మిది నిమిషాల నలభై సెకన్ల నిడివితో హనుమాన్ భక్తులని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. టి సిరిస్ అధినేత గుల్షన్ కుమార్(Gulshan Kumar)హనుమాన్ భక్తుడిగా సదరు గీతంలో కనిపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ 500 కోట్ల వీక్షణలని అందుకుంది.ఈ స్థాయిలో వీక్షణల్ని అందుకున్న తొలి భారతీయ వీడియో కూడా ఇదే.

also read: శ్రీదేవి బయోపిక్ లో ఈ స్టార్ హీరోయిన్ ఓకేనా! మరి బోణీ కపూర్ ఏమంటాడో

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుండటంతో భారతదేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రికార్డుపై టి సిరీస్ ప్రస్తుత అధినేత గుల్షన్ కుమార్ కొడుకు భూషణ్ కుమార్(Bhushan Kumar)మాట్లాడుతు నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసా కి ప్రత్యేకమైన స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపే వారు. అది అందరికి చేరుకోవాలని కోరుకునే వారు. 500 కోట్ల వీక్షణలు అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్ఫూర్తిని ఇస్తుందని తెలిపాడు. లెజండ్రీ సింగర్ హరిహరన్(Hariharan)గాత్రంలో హనుమాన్ చాలీసా రూపొందింది.