English | Telugu
సమస్యలతో సతమవుతున్న హీరోయిన్
Updated : Oct 16, 2025
సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగిన చాలా మంది నటీమణులు, వ్యక్తిగత జీవితంలోకి వచ్చే సరికి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేస్తుంటారు. ఇందుకు ప్రస్తుత నటీమణులతో పాటు వర్తమానానికి చెందిన నటీమణులు అతీతులేమి కాదు. ప్రస్తుతం అలాంటి సమస్యలనే ఎదుర్కొంటుంది హన్సిక. దేశముదురు చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక(Hansika Motwani)అనతి కాలంలోనే ఎన్టీఆర్(Ntr)వంటి అగ్ర హీరోలతో సైతం ఆడిపాడింది.
కొన్ని రోజుల క్రితం హన్సిక పై గృహ హింస కేసు నమోదయ్యింది. స్వయానా తన సోదరుడి భార్య కేసు నమోదు చెయ్యడంతో కోర్టు నోటీసులు సైతం అందుకోవడంతో పాటు, ఈ కేసుకి సంబంధించి తన తల్లి తండ్రుల నుంచి కూడా హన్సిక కి ఇబ్బందులు ఏర్పడినట్టుగా తెలుస్తుంది. తన భర్త సోహైల్ తో విబేధాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఫలితంగా కొన్ని మూవీ ఆఫర్స్ వెనక్కి వెళ్లినట్టు టాక్. దీంతో వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒకే సారి ఇబ్బందులు ఏర్పడడటంతో హన్సిక తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లినట్టుగా సినీ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో సైతం సదరు న్యూస్ హల్ చల్ చేస్తుండగా వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటానికి హన్సిక ఇటీవలే తన స్నేహితులతో కలిసి భారీ లాంగ్ టూర్ వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
కెరీర్ పరంగా చూసుకుంటే 2003 లో హిందీ సినీ రంగంలో బాలనటిగా అగ్ర హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీని ఆకర్షించింది. తెలుగు, హిందీ, మలయాళంలో కలుపుకొని ఇప్పటి వరకు సుమారు ముప్పై చిత్రాల వరకు హీరోయిన్ గా చెయ్యగా,పలు వెబ్ సిరీస్ లోను సత్తా చాటింది. గత ఏడాది గార్డియన్ అనే హార్రర్ చిత్రంతో టైటిల్ రోల్ లో పలకరించింది.