English | Telugu
నాంపల్లి కోర్టుకి వెంకటేష్.. ఏం జరగబోతుంది
Updated : Oct 16, 2025
విక్టరీ వెంకటేష్(Venkatesh)తొలి నుంచి వివాదాలకి దూరంగా ఉంటు వస్తాడు. వృత్తి పరంగాను వ్యక్తిగత పరంగాను మొదటి నుంచి ఇదే పంధాలో ఉంటాడు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. గత కొన్ని రోజుల నుంచి వెంకటేష్ ఫ్యామిలీ మధ్య, నందకుమార్ అనే వ్యాపారవేత్త మధ్య దక్కన్ కిచెన్ హోటల్(Deccan Kitchen Hotel)కూల్చివేతకి సంబంధించిన కేసు వ్యవహారం నడుస్తు వస్తుంది. వెంకటేష్ తో పాటు, ఆయన సోదరుడు సురేష్, రానా, అభిరాంపై ఈ కేసులో ఇప్పటికే ఫిలింనగర్ లో కేసు నమోదవ్వగా, నందకుమార్ పై కూడా వెంకటేష్ ఫ్యామిలీ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకి సంబంధించి విచారణకి హాజరు కావాలని, నాంపల్లి కోర్టు(Nampally Court)గతంలో వెంకటేష్ ఫ్యామిలీకి నోటీసులు జారీ చేసింది. కానీ హాజరు కాలేదు. దీంతో ఈ రోజు విచారణకి హాజరు కావాలని మరోసారి కోర్టు నోటీసులు పంపించడంతో వెంకటేష్ ఫ్యామిలీ ఈ రోజు కోర్టుకి హాజరు కానుంది. దీంతో కోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది.
ఫిలింనగర్ లో వెంకటేష్ ఫ్యామిలీకి చెందిన 1000 గజాల స్థలాన్ని నందకుమార్ లీజుకి తీసుకొని దక్కన్ కిచెన్ హోటల్ ని ఏర్పాటు చేసాడు. లీజుకి సంబంధించిన విషయంపై ఇరు వైపుల అభిప్రాయబేధాలు రావడంతోనే సదరు కేసు నడుస్తు ఉంది.