English | Telugu

"సాహసం"పై దర్శకుడి నమ్మకం

గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "సాహసం". తాప్సీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈరోజు (జూలై 12) విడుదలవుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... "చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. పూర్తి కమర్షియల్, అడ్వెంచర్ చిత్రంగా ఉంటుంది. తనకు దక్కవలసిన తన తాతల నాటి ఆస్థిని హీరో ఎలా దక్కించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కించం. ఇందులో గోపీచంద్, తాప్సీలతో పాటు మిగత నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము" అని తెలిపారు. మరి ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పబోతుందో చూడాలి.