English | Telugu

రేపు థియేటర్లలో బాబాయ్ తో కలిసి అబ్బాయ్ సందడి!

నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'భగవంత్ కేసరి' రేపు(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి' విజయాలతో జోరు మీదున్న బాలయ్య ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్. రేపు థియేటర్లలో బాబాయ్ తో పాటు అబ్బాయ్ కూడా సందడి చేయనున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న మూవీ 'అదుర్స్'. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చారి-భట్టు గా ఎన్టీఆర్-బ్రహ్మానందం పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. 2010 విడుదలైన ఈ సినిమా 13 ఏళ్ళ మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాని నవంబర్ 18న రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ రీరిలీజ్ టీజర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని 400కి పైగా థియేటర్లలో అదుర్స్ రీరిలీజ్ టీజర్ ని ప్రదర్శించనున్నారు. అంటే రేపు థియేటర్లలో బాబాయ్ తో పాటు అబ్బాయ్ కూడా సందడి చేయనున్నాడన్నమాట. ఇది నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.