English | Telugu
దసరా టైం లో అమ్మవారితో తొలిసారిగా విదేశాలకి రామ్ చరణ్
Updated : Oct 18, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ నుంచి కొన్ని రోజులు రిలీఫ్ దొరికింది. దీంతో రామ్ చరణ్ విదేశాలలో సేద తీరడానికి వెళ్తున్నాడు. ఇందులో కొత్తేమి ఉంది రామ్ చరణ్ అప్పుడప్పుడు ఫారిన్ కంట్రీ కి వెళతాడు కదా అని అనుకుంటున్నారా? కానీ ఇక్కడే ఒక బిగ్ సర్ప్రైజ్ వుంది. తన భార్య ఉపాసనతో పాటు ఇంకో విశిష్ట అతిథి తో చరణ్ అదర్ కంట్రీ వెళ్తున్నాడు. పైగా ఆ అతిథికి ఇదే ఫస్ట్ ఫారిన్ ట్రిప్. ఎవరు ఆ విశిష్ట అతిథి అని అనుకుంటున్నారా?
రామ్ చరణ్ అండ్ ఉపాసనల ముద్దుల తనయ పేరు క్లీంకార...క్లీంకార అంటే సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి రూపానికి మరో రూపం అని పేరు. చరణ్ ఉపాసన ల పెళ్లయిన పది సంవత్సరాల కి క్లీంకార పుట్టింది. ఇప్పుడు క్లీంకార తొలిసారిగా ఫారిన్ ట్రిప్ వెళ్తుంది. అందుకు సంబంధించి చరణ్ అండ్ ఉపాసన లు పాప తో ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోస్ ని కొంత మంది సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. చరణ్,ఉపాసనలు క్లీంకార ని తీసుకొని ఇటలీ దేశానికీ వెళ్తున్నారు. చరణ్ తనకి ఇష్టమైన పెట్ రైమ్ ని తన ఒడిలో పెట్టుకొని ఉన్నాడు. ఉపాసన క్లీంకార ని ఎత్తుకొని ఉంది. ఇక్కడ కూడా క్లీంకార ముఖాన్ని ఉపాసన కనపడనీయక పోవడం విశేషం.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కాగా చరణ్,ఉపాసనలు తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇటలీ నుంచి వస్తారో అని చరణ్ అభిమానులు అనుకుంటున్నారు.
ఇంతవరకు క్లీంకార ముఖం ఎలా ఉంటుందో బయట వ్యక్తులెవరికి తెలియదు. కేవలం చిరంజీవి అండ్ ఉపాసన ల కుటుంబసభ్యులకు అలాగే బయట కొంత మంది బంధువులకి మాత్రమే క్లీంకార ముఖం తెలుసు. మెగా అభిమానులు మాత్రం ఎప్పుడెపుడు తమ అభిమాన కధానాయకుడి కూతురు క్లీంకార ముఖం చూస్తామా అనే ఉత్సాహం తో ఉన్నారు.