English | Telugu
రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్!
Updated : Oct 18, 2023
దసరా పండగ వస్తోంది. అంతకంటే ముందే సినిమాల పండగ రాబోతోంది. అంటే అక్టోబర్ 19, 20 తేదీల్లో మూడు భారీ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, విజయ్ ‘లియో’ చిత్రాలు ఈ దసరాకి సందడి చేయబోతున్నాయి. ఈ మూడు సినిమాలపైన భారీ అంచనాలే ఉన్నాయి. మూడు డిఫరెంట్ జోనర్స్‌లో రూపొందిన ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి.
‘టైగర్ నాగేశ్వరరావు’ రవితేజ మొదటి సారి పాన్ ఇంయా మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాడు. స్టూవర్ట్‌పురం దొంగగా ఎంతో పాపులర్ అయిన నాగేశ్వరరావు జీవిత కథను ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. నాగేశ్వరరావు కాస్తా టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్ రేంజ్‌లో బిజినెస్ జరిగిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’? ఈ సినిమా మొదటి రోజు రూ.5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.37.50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఆంధ్రా ఏరియా మొత్తం 17 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. సీడేడ్ రైట్స్ రూ.5 కోట్ల 40 లక్షలు, నైజాంలో రూ. 8 కోట్ల 60 లక్షల వరకు టైగర్ నాగేశ్వరరావు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్‌సీస్‌లో థియేట్రికల్ బిజినెస్ రూ. 3కోట్ల వరకు జరిగిందట. ‘టైగర్ నాగేశ్వరరావు’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.38 కోట్ల 50 లక్షలు. రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలకు రెట్టింపు బిజినెస్ ఈ సినిమా చేసిందని చెబుతున్నారు. రావణాసుర రూ.22 కోట్లు, ధమాకా రూ. 19 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వాటిని ‘టైగర్ నాగేశ్వరరావు’ క్రాస్ చేసింది. రావణాసుర తొలిరోజు రూ.4.30 కోట్లు, ధమాకా రూ.4.70 కోట్లు కలెక్ట్ చేసాయి. ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ కలెక్షన్స్‌ను దాటేసే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.