English | Telugu

రెండు కోట్ల కొండెక్కిన దేవిశ్రీ

డైరెక్టర్లు పదేసి కోట్లు.. హీరోలు పదిహేనేసి కోట్లు తీసుకుంటుండగా.. తాను మాత్రం కోటి రూపాయలతోనే సరిపెట్టుకోవడం నామోషీగా భావించినట్లున్నాడు దేవిశ్రీప్రసాద్. అందుకే తన రెమ్యూనరేషన్‌ను రెండు కోట్లకు పెంచేసాడు. "జులాయి, గబ్బర్‌సింగ్, మిర్చి" చిత్రాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్టయి.. ఆ చిత్రాలు సాధించిన విజయాలలో సముచిత పాత్ర పోషించడంతో.. ప్రతి డైరెక్టరు, హీరో.. దేవిశ్రీప్రసాద్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్సయిపోవడం మొదలుపెట్టారు. ఈ తాకిడిని తట్టుకోలేక్.. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ.. మొన్నటివరకు కోటి, కోటిన్నర మధ్య తీసుకుంటూ వచ్చిన దేవిశ్రీప్రసాద్.. గత కొన్ని చిత్రాలుగా.. రెండు కోట్ల కొండెక్కి కూర్చున్నాడని తెలుస్తోంది. డైరెక్టర్‌కి పది కోట్లు.. హీరోకి పదిహేను కోట్లు ఇచ్చినా.. మ్యూజిక్ హిట్టయితేనే సినిమా హిట్టవుతుంది కాబట్టి.. తనకు రెండు కోట్లిచ్చినా తక్కువేనని వాదిస్తున్నాడంట దేవిశ్రీ. ఇతగాడు ప్రస్తుతం బాలకృష్ణ_బోయపాటి కాంబినేషన్ సినిమా, నాగార్జున "భాయ్", పవన్‌కళ్యాణ్ "అత్తారింటికి దారేది?", మహేష్‌బాబు నటిస్తున్న "ఒన్ నేనొక్కడినే", రామ్‌చరణ్ "ఎవడు", కార్తీ "బిర్యానీ" చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు!