English | Telugu

దేవర రికార్డుని టచ్ చేయలేకపోతున్న స్టార్స్!

స్టార్ హీరోల సినిమాలు భారీ బిజినెస్ చేస్తుంటాయి. దీంతో ఓవరాల్ గా హిట్ అనిపించుకున్న సినిమాలు కూడా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇలా ఎనిమిది ఏరియాలుగా బిజినెస్ జరుగుతుంది. అయితే కోవిడ్ తర్వాత ఈ ఎనిమిది ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించిన బడా సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' మాత్రమే ఈ ఫీట్ సాధించింది అనేది ట్రేడ్ మాట. ఇక 'దేవర' తర్వాత ఎన్నో బడా సినిమాలు విడుదల కాగా, ఒక్కటీ ఈ ఫీట్ సాధించలేకపోయింది అంటున్నారు. (Devara)

'దేవర' తర్వాత వచ్చిన 'పుష్ప-2' సినిమా హిందీ గడ్డ మీద ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా.. వరల్డ్ వైడ్ గా 'బాహుబలి-2' స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టించింది. అలాంటి 'పుష్ప-2'.. ఈస్ట్, వెస్ట్ లలో స్పల్ప నష్టాలను చూసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అనంతరం వచ్చిన 'గేమ్ ఛేంజర్', 'హరి హర వీరమల్లు', 'వార్-2' వంటి సినిమాలు చేదు ఫలితాలను చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. ఇక ఇటీవల విడుదలైన 'ఓజీ' ఓవరాల్ గా మంచి వసూళ్లతో సత్తా చాటినప్పటికీ.. సీడెడ్ తో పాటు ఆంధ్రాలోని ఒకట్రెండు ఏరియాల్లో స్వల్ప నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి 'దేవర' తర్వాత ఐదు బడా సినిమాలు రాగా.. ఒక్కటీ తెలుగునాట అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మరి నెక్స్ట్ వచ్చే బడా సినిమాల్లో ఈ ఫీట్ సాధించే చిత్రమేదో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.