English | Telugu
పవన్ కళ్యాణ్.. అభినవ కృష్ణ దేవరాయ...
Updated : Dec 8, 2025
సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సినీ రంగంలో పవర్ స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్.. రాజకీయ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ జాతీయస్థాయి గుర్తింపు పొందారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఓ అరుదైన గౌరవం దక్కింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 'అభినవ కృష్ణ దేవరాయ' అనే గొప్ప బిరుదు లభించింది. కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. ఆయనకు ఈ బిరుదుని ప్రదానం చేశారు.
Also Read: ఓటీటీలోకి కాంత.. రిజల్ట్ రివర్స్ అవుతుందా..?
ఆదివారం సాయంత్రం ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన 'బృహత్ గీతోత్సవ' కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం చేశారు.
'బృహత్ గీతోత్సవ'లో పవన్ మాట్లాడుతూ.. భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. భగవద్గీత ప్రాంతాలకో, మతాలకో ఉద్దేశించిన గ్రంథం కాదు.. భగవద్గీత మనో ధైర్యమిచ్చే గురువు, నిర్దేశించే దిక్సూచి అన్నారు. భగవద్గీత ఒకసారి చదివి ఎర్ర వస్త్రంతో కప్పి పూజ గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మనల్ని నడిపించే జ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు.