English | Telugu

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విజయ్ దళపతి!

కొంతకాలంగా కోలీవుడ్ స్టార్స్, టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు' సినిమా చేయగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ 'సార్' సినిమా చేశాడు. ఇక ఇప్పుడు విజయ్ మరో టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

'క్రాక్', 'వీరసింహారెడ్డి' సినిమాలతో వరుస విజయాలు అందుకొని హ్యాట్రిక్ పై కన్నేసిన మలినేని.. తన తదుపరి సినిమాని తమిళ్ హీరోతో చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసి.. ఇటీవల విజయ్ ని కలిసి వినిపించగా.. ఆయన వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు ఇన్ సైడ్ టాక్. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనుందట. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న 'లియో' సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని అంటున్నారు. త్వరలోనే విజయ్-గోపీచంద్ మలినేని మూవీ ప్రకటన రానుందని, దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశముందని వినికిడి.