సమంత, రాజ్ పెళ్లిపై రాజ్ సోదరి పోస్ట్ వైరల్..ఇలా జరగాల్సిందే అంటున్న ఫ్యాన్స్
on Dec 3, 2025

రాజ్ సోదరి ఏం చెప్పింది!
అభిమానులు ఏమంటున్నారు
'లవ్ యూ' చెప్పిందెవరు!
డిసెంబర్ 1 సాయంత్రం నుంచి స్టిల్ నేటి వరకు దాదాపుగా అన్ని మీడియా ఛానల్స్, సోషల్ మీడియా వేదికగా చూసినా కూడా సమంత(Samantha),రాజ్(Raj)సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ వస్తున్నారు. ఆ ఇద్దరి పెళ్లికి సంబంధించిన ఎన్నో స్పెషల్ న్యూస్ తో పాటు సమంత, రాజ్ పరిచయం, ఆ తర్వాత పెళ్ళికి దారి తీసిన పరిస్థితులు వంటి విషయాల గురించి వస్తూనే ఉన్నాయి. అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో సదరు వార్తలని చూస్తూ ఉండటమే కాకుండా సమంత, రాజ్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నారు.
రీసెంట్ గా సమంత, రాజ్ ల వివాహం పై రాజ్ సోదరి 'శీతల్'(Shethal)సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ నోట్ ఒకదాన్ని విడుదల చేసింది. సదరు నోట్ లో ఆమె స్పందిస్తు 'నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగిపోతుండటంతో పాటు సమంత, రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకుసాగుతుండడం చూసి మాకెంతో గర్వంగా ఉంది.
aslo read: పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నాడు! తెలంగాణ ఫ్యాన్స్ ఏమంటున్నారు
ఒకరిపై ఒకరికి గౌరవం, నిజాయతీతో రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుంది.సమంతకి నేను ఎప్పుడు అండగా ఉంటాను .భక్తుడు ఆర్తితో శివ లింగాన్ని ఆలింగినం చేసుకొంటే ఎంత ఆనందంగా ఉంటాడో ఈ రోజు నేను అలా ఉన్నాను. మేము వీరికి ఎప్పుడూ అండగా ఉంటామని నోట్ లో రాసుకొచ్చింది. సదరు పోస్ట్‌పై సమంత స్పందిస్తు 'లవ్ యూ'(LOve You)అని రిప్లై ఇచ్చింది. ఇక అభిమానులైతే మెట్టినింట సమంత కి ఎంతో ప్రేమ దక్కుతుండటంపై సోషల్ మీడియా వేదికగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



