English | Telugu

ఓటిటిలో హంగామ చేస్తున్న కూలీ.. ఇది సన్ పిక్చర్స్ చేసిన పనే

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth),కింగ్ నాగార్జున(Nagarjuna),లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం 'కూలీ'(Coolie). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, ఈ నెల 14 న వరల్డ్ వైడ్ గా,విడుదల కానుంది. బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Aamir Khan)'దహ' అనే గ్యాంగ్ స్టర్ గా స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తుండటం, కన్నడ స్టార్ హీరో 'ఉపేంద్ర'(upendra)కీలక పాత్రలో కనిపిస్తుండటంతో, కూలీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

రీసెంట్ గా 'కూలీ'ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నై వేదికగా అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని 'కూలీ అన్ లిషెడ్'(Coolie Unleashed)పేరుతో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ (Sun Next)వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చారు.ఇందులో రజనీ స్పీచ్ తో పాటు మూవీ గురించి ఇతర అగ్ర తారలు పంచుకున్న విశేషాలు, మ్యూజిక్ ని అందించిన అనిరుద్ స్టేజ్ పెర్ ఫార్మెన్సు , సౌభిన్ షాహిర్ చేసిన మోనికా డాన్స్ ఉన్నాయి.

పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్నప్రేక్షకులకి 'కూలీ'ని మరింత చేరువ చెయ్యడానికి మేకర్స్ 'అమెజాన్' డెలివరీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కూలీ కి సంబంధించిన బాగ్స్, స్టిక్కర్స్ ని ఇండియా వ్యాప్తంగా ఉచితంగా పంపిణి చేస్తున్నారు. శృతి హాసన్(Shruthi Haasan) రచిత రామ్, జూనియర్ ఎంజిఆర్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun Pictures)భారీ వ్యయంతో నిర్మిస్తుంది.