English | Telugu

తూచ్ అంతా అబద్దం.. కథ మళ్ళీ మొదటికి 

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ 'రేణు దేశాయ్'(Renudesai)మొన్న దీవాలి(Diwali)సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సన్యాసం తీసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ మాటలు వైరల్ గా నిలవడమే కాకుండా అభిమానులు,శ్రేయోభిలాషుల నుంచి సోషల్ మీడియా వేదికగా భిన్నమైన మాటలు వినపడుతున్నాయి.

రీసెంట్ గా ఈ విషయంపై రేణుదేశాయ్ ఇన్ స్టాగ్రామ్(Instagram)వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతు ఇలాంటి వీడియోని చేయాల్సి వస్తుందని నిజంగా అనుకోలేదు. మొన్న దీపావళికి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే యాంకర్ నాతో మాట్లాడుతు 'మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు పెద్దవుతున్నారు, ఎన్జీఓ రన్ చేస్తున్నారు.. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటని క్యాజువల్ గా అడిగింది. దాంతో నేను వెంటనే ఆమెతో సన్యాసం తీసుకుంటానని సరదాగా చెప్పాను. ఆ విషయాన్నీ నేనేదో జోక్ గా చెప్తే, ఇప్పుడు ఆ వార్త చాలా పెద్దదయిపోయింది. నా మీద రక రకాల కధనాలు ప్రసారం అవుతున్నాయి. చాలామంది ఆ వార్తలు నాకు షేర్ చేశారు. మా ఫ్రెండ్స్ వాళ్ల తల్లులు కూడా 'రేణూ నీకు ఏమైంది.బాగానే ఉన్నావు కదా,ఈ వయసులో సన్యాసం ఎందుకు అని బాధ పడుతున్నారు. కొంత మంది అయితే తిడుతున్నారు కూడా.ఆద్యకి 15 సంవత్సరాలు.10వ తరగతి చదువుతోంది. ఇంత తొందరగా నేను సన్యాసం తీసుకోను.

ఖచ్చితంగా నా అల్టిమేట్ స్టేజ్ అయితే సన్యాసమే. కానీ ఇప్పుడే కాదు. ముసలిదాన్ని అయిన తర్వాత తీసుకుంటా. నాకు ఇప్పుడు 45 ఏళ్లు. 55 , 65 సంవత్సరాలు వచ్చినప్పుడు సన్యాసంలోకి వెళ్లిపోతాను అని సదరు వీడియోలో మాట్లాడింది. సినిమాల పరంగా చూసుకుంటే టైగర్ నాగేశ్వరరరావు తో రీఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. అత్తా కోడళ్ల మధ్య ఎంటర్ టైన్ మెంట్ కోణంలో జరిగే సబ్జెక్టు కాగా, అత్త క్యారక్టర్ లో రేణుదేశాయ్కనిపించబోతుండటం విశేషం.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.