English | Telugu

వైఫ్‌తో కాఫీ కైపునిచ్చేనా ?

ఇటీవలకాలంలో మన తెలుగులో ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నిన్నటివరకూ తెలుగుతో మిళితమైపోయిన "గ్యాంగ్‌లీడర్, మాస్, బాస్, లీడర్" వంటి టైటిల్స్ పెట్టిన మన దర్శకులు_నిర్మాతలు.. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్లి "ఇట్స్ మై లవ్ స్టోరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" వంటి టైటిల్స్ పెట్టేస్తున్నారు. ఈ కోవలో వస్తున్న చిత్రం "కాఫీ విత్ మై వైఫ్". బాలీవుడ్‌లో కరణ్ జోహార్ అనే ఓ ప్రముఖ దర్శకుడు "కాఫీ విత్ కరణ్" పేరిట కొన్నాళ్లు ఓ టివి ప్రొగ్రామ్‌ నిర్వహించాడు. ఆ స్ఫూర్తితోనో ఏమో.. ఇప్పుడు తెలుగులో "కాఫీ విత్ మై వైఫ్" పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. "ఆ నలుగురు" చిత్రంతో రచయితగా గుర్తింపు తెచ్చుకొని.. "పెళ్లయిన కొత్తలో, ప్రవరాఖ్యుడు" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మదన్.. "కాఫీ విత్ మై వైఫ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. పూర్తిగా అర్బన్ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందుతున్నట్లుగా కనబడుతున్న ఈ చిత్రం వారిని ఏమేరకు అలరిస్తుందో వేచి చూడాల్సిందే!