English | Telugu
మైకంలో పడేస్తానంటున్న చార్మి
Updated : Jul 27, 2013
దాదాపు అందరు అగ్రకథానాయకుల సరసన హీరోయిన్‌గా నటించినా, ఆ స్టార్‌డమ్ నిలబెట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయింది హీరోయిన్ చార్మీ.. టాలీవుడ్‌లో పెద్ద గా ఆదరణ లేని లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అయినా ఆకట్టుకోవాలనుకున్నా అది కూడా వర్కవుట్ కాలేదు.. మంత్ర, మంగళ లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాసులు రాల్చే స్టార్ డమ్ ను మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయింది. దీంతో అందాల ప్రదర్శనకు కూడా రెడీ అయిందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో నటిగా నిరూపించుకోవాటనికి స్టార్ హీరోయిన్స్ సైతం నమ్ముకున్న వేశ్య పాత్రలో కనిపింస్తుతుంది చార్మీ.. ప్రేమే ఓ మైకం అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, ఓ వేశ్య ఓ గాయకుడు, ఓ రచయిత చుట్టూ తిరుగుతుంది..
ఇప్పటికే శ్రియ వేశ్యపాత్రలో నటించిన పవిత్ర సినిమా మంచితో మంచి పేరు సంపాదించుకున్నా కాసులు మాత్రం కురిపించలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు నిర్మాతలు. మరి ఈ సినిమా అయిన చార్మీని సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి..