English | Telugu

రామ్ చరణ్ క్రికెట్ ఆడతాడా! దేవర సినిమాటోగ్రాఫర్ ఆసక్తి కర ట్వీట్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం తన 16 వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ప్రీవియస్ మూవీ 'గేమ్ చేంజర్'(Game Changer)పెద్దగా ప్రేక్షకాదరణ పొందని నేపథ్యంలో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.ఇక ఈ మూవీని ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టుగా తెలుస్తుంది.'దేవర'(Devara)ఫేమ్ జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా,బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.


ఇక ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుందనే వార్తలు,మూవీ ప్రారంభమైనప్పట్నుంచి వస్తూనే ఉన్నాయి.ఇందుకు సంబంధించి రక రకాల క్రీడల పేర్లు కూడా బయటకి వచ్చాయి.చిత్ర బృందం మాత్రం ఇంతవరకు పలనా కథ అంటూ ఎక్కడ అధికారంగా వెల్లడి చెయ్యలేదు.కానీ ఇపుడు ఈ మూవీకి ఫొటోగ్రఫీ ని అందిస్తున్న లెజండరీ ఫోటోగ్రాఫర్ రత్నవేలు(Rathnavelu)ఎక్స్ వేదికగా 'రాత్రిళ్ళు షూటింగ్‌,ఫ్ల‌డ్ లైట్లు,ప‌వ‌ర్ క్రికెట్,విచిత్ర కోణాలు అంటూ ట్వీట్ చెయ్యడం జరిగింది.దీంతో ఆర్ సి 16 క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోందని,రెండు గ్రామాల మ‌ధ్య జ‌రిగే క్రికెట్ ఆధారంగా మూవీ ఉండబోతుందని మెగా అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

ఆర్ సి 16 కి రత్నవేలు వర్క్ చేస్తున్నప్పట్నుంచే మూవీకి సంబంధించిన కొన్ని కీలక విషయాల్ని అభిమానులతో పంచుకుంటూ వస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం నెగెటివ్ కెమెరా, ఫిల్మ్ కెమెరాలతో కొంత పార్ట్ షూటింగ్ చేస్తున్నామని,ఆ సీన్లు ఎంతో బాగా వచ్చాయి.సహజత్వానికి దగ్గరగా కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు.ఇలా ఇప్పుడు క్రికెట్ గురించి కూడా చెప్పి మెగా అభిమానుల్లో సరికొత్త జోష్ ని తీసుకొచ్చాడు.రత్నవేలు లేటెస్ట్ గా 'దేవర'తో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక ఆర్ సి 16 ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్(Sukumar)రైటింగ్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.