English | Telugu

కొత్త రిలీజ్ డేట్ కి మిరాయ్.. రాజా సాబ్ పరిస్థితి ఏంటి..?

'హనుమాన్' తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జ.. ప్రస్తుతం 'మిరాయ్' సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. (Mirai)

పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'మిరాయ్'ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ అప్పటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేకపోవడంతో, జూలై 4 కి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంకా 30 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మిగిలిన షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి టైం పడుతుందన్న కారణంతోనే జూలైకి వాయిదా వేసినట్లు వినికిడి.

అయితే 'మిరాయ్' డేట్ మారితే, 'ది రాజా సాబ్' (The Raja Saab) పరిస్థితి ఏంటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న 'రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత 'మిరాయ్'ని ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. 'రాజా సాబ్' విడుదల వాయిదా ఖాయమని భావించారంతా. కానీ ఇప్పుడు 'మిరాయ్'నే వాయిదా పడుతోంది. ఈ క్రమంలో 'రాజా సాబ్' విడుదల ఎప్పుడు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది.