English | Telugu
ప్రముఖ నటి కన్నుమూత.. అప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడిలా...
Updated : Feb 5, 2026
- టాలీవుడ్ లో మరో విషాదం
- ప్రముఖ నటి జయవాహిని కన్నుమూత
తెలుగు పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి జయవాహిని కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె.. బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. (Actress Jaya Vahini)
విజయనగరానికి చెందిన జయవాహిని.. టెలివిజన్, సినీ రంగాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా టీవీ సీరియల్స్ లో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తెలుగుతో పాటు తమిళ సీరియల్స్ లోనూ నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. అయితే క్యాన్సర్ తో పోరాడుతూ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. చివరిగా 'బహిర్భూమి', 'పోలీస్ వారి హెచ్చరిక' వంటి సినిమాల్లో ఆమె నటించారు.
జయవాహిని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ముఖ్యంగా జయవాహినితో మంచి అనుబంధమున్న కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెట్టారు. "అక్కా నిన్ను కాపాడాలని చాలా ప్రయత్నం చేసినా ఆ దేవుడి దగ్గరకు వెళ్ళిపోయావు. నువ్వు కరాటే నేర్చుకున్నప్పుడు విజయనగరం లో సైకిల్ మీద వెళ్తూ స్కూల్ నుండి నన్ను కూడా ఎక్కించుకొని మా ఇంటిదగ్గర దింపిన రోజులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. కేన్సర్ ఎప్పటికైనా ప్రాణాంతకం. మహిళలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి. అక్క బాధను మేము చూడలేకపోయాము. భగవంతుడు కూడా ఆమె బాధ చూడలేక దగ్గరకి తీసుకున్నాడు" అంటూ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.