English | Telugu

బన్నీ అక్కడ "తల్లు అర్జున్" అవుతున్నాడా...?

తెలుగుతోపాటు మలయాళంలోనూ సమానమైన క్రేజ్ కలిగిన ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్. మలయాళంలో అందరూ అతడ్ని "మల్లు అర్జున్" అని పిలుచుకుంటున్నారు. అయితే తమిళ పరిశ్రమలో కూడా తన సినిమాలతో ఎలాగైనా స్థానం సంపాదించుకోవాలి అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్‌తో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథా, చర్చలు పూర్తయ్యాయి. ఆగష్టులో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా అమలాపాల్, అంజలి పేర్లు అనుకుంటున్నట్లు తెలిసింది.

మరి తెలుగులో "అల్లు అర్జున్", మలయాళంలో "మల్లు అర్జున్" అని పిలిపించుకున్న బన్నీ... తమిళంలో ఏమని పిలిపించుకుంటాడు. "తల్లు అర్జున్"? లేక ఇంకేమైనా స్టైలిష్ నేమ్ వెతుకుతాడ అనేది త్వరలోనే తెలియనుంది.