English | Telugu

రెండో రోజు కలెక్షన్ల జోరు చూపించిన 'బ్రో'

రెండో రోజు కలెక్షన్ల జోరు చూపించిన 'బ్రో'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో' శుక్రవారం(జూలై 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా, రెండోరోజు ఆశించిన దానికంటే ఎక్కువ షేర్ రాబట్టడం విశేషం. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.23.61 కోట్ల షేర్, రెండోరోజు రూ.10.47 కోట్ల షేర్ రాబట్టిన బ్రో మూవీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రెండు రోజుల్లో రూ.34.08 కోట్ల షేర్(బిజినెస్ రూ. 80.50 కోట్లు) వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే రెండు రోజుల్లో నైజాంలో రూ.13.25 కోట్ల షేర్(బిజినెస్ రూ.30 కోట్లు), సీడెడ్ లో రూ.4.01 కోట్ల షేర్(బిజినెస్ రూ.13.20 కోట్లు), ఆంధ్రాలో రూ.16.82 కోట్ల షేర్(బిజినెస్ రూ.37.30 కోట్లు) రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.3.15 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.5.10 కోట్ల షేర్ కలిపి.. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.42.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్ గా రూ.97.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన బ్రో చిత్రం.. మొదటిరోజు రూ.30.01 కోట్ల షేర్, రెండోరోజు రూ.12.32 కోట్ల షేర్ తో.. రెండు రోజుల్లో రూ.42.33 కోట్ల షేర్ తో 43 శాతం రికవర్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.56 కోట్ల దాకా షేర్ రాబట్టాల్సి ఉంది. మూడోరోజు ఆదివారం కావడంతో మరో పది కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది. వీక్ డేస్ లో హోల్డ్ చేసే దానిపై ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంది.

బ్రో రెండు రోజుల వసూళ్ళ వివరాలు:
నైజాం: రూ.13.25 కోట్ల షేర్ (జీఎస్టీతో కలుపుకుని)
సీడెడ్: రూ. 4.01 కోట్లు
ఉత్తరాంధ్ర: రూ. 4.08 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
ఈస్ట్ గోదావరి: రూ.3.13 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ.3.35 కోట్లు
గుంటూరు: రూ.3.25 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
కృష్ణా: రూ.1.97 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
నెల్లూరు: రూ. 1.04 కోట్లు (జీఎస్టీతో కలుపుకుని)
ఆంధ్ర + తెలంగాణ మొత్తం: రూ.34.08 కోట్ల షేర్ (రూ.52.50 కోట్ల గ్రాస్) 
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ.3.15 కోట్లు
ఓవర్సీస్: రూ.5.10 కోట్లు
వరల్డ్ వైడ్: రూ.42.33 కోట్ల షేర్ (రూ. 69.65 కోట్లు గ్రాస్)