English | Telugu

నా అభిరుచులు మారాయి.. నా మైండ్ సెట్ మారిపోయింది

బుల్లితెర మీద నుంచి సిల్వర్ స్క్రీన్ మీదకు వెళ్ళాక అనసూయలో చాలా మార్పులే వచ్చాయి. నిన్నమొన్నటి వరకు చాలా కాంట్రవర్సీస్ లో ఇరుక్కుపోయింది. విజయ్ దేవరకొండ ఫాన్స్ కి అనసూయకు మధ్య ట్విట్టర్ వార్ కూడా జరిగింది. ఆంటీ అన్నందుకు ఫైర్ అయ్యింది. పోలీస్ కేసులు అంటూ చాలా డ్రామా నడిచింది. ఐతే ఈ మధ్య అనసూయ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం మానేసింది. ట్విట్టర్ లో కూడా పెద్దగా తలదూర్చడం లేదు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన మూవీ "బేబీ" రిలీజ్ ఐన సందర్భంలో అతనికి ట్విట్టర్ లో ఆల్ ది బెస్ట్ అంటూ విష్ కూడా చేసింది. అలా విజయ్ దేవరకొండ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. బేబీ మూవీ ప్రొమోషన్స్ లో ఆనంద్ దేవరకొండను ఈ విషయం గురించి అడిగినా తనకు అవేవీ తెలీదని చెప్పాడు.

నేను నా మూవీస్ చేసుకుంటున్నానా, వెకేషన్స్ కి వెళ్తున్నానా, నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానా అన్నట్టుగా మారిపోయింది అనసూయ. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోల్లో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేస్తూ ఉంది. ఇక రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేసింది అందులో బ్యాక్ గ్రౌండ్ లో ఒక వాయిస్ వినిపించింది. "నేను స్త్రీ ఐనందుకు చాలా గర్వపడతాను. నా మైండ్ సెట్ మారిపోయింది. నా అభిప్రాయాలూ, నా అభిరుచులు మారాయి...నాలో సహనం పెరిగింది..నా ఆలోచనా పరిధి కూడా పెరిగింది" అంటూ తనలో కొత్తగా మొదలైన మార్పుల గురించి ఈ వీడియోలో చెప్పింది. ఏదైనా బోల్డ్ గా చెప్పే అనసూయ ఇంతలా చేంజ్ అవడం ఏమిటా అని అనుకుంటున్నారు నెటిజన్స్.

బుల్లితెర మీద కొన్నేళ్ల పాటు జబర్దస్త్ యాంకర్ గా చేసింది. ఇక స్మాల్ స్క్రీన్ కి బ్రేక్ ఇచ్చేసి సిల్వర్ స్క్రీన్ మీద కాన్సంట్రేషన్ చేసింది. తన కష్టానికి తగ్గట్టు పాన్ ఇండియా మూవీస్ లో మంచి మంచి రోల్స్ వచ్చాయి. ఇప్పుడు 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2' తో పాటు ఇంకా కొన్ని మూవీస్ లో నటిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మిగతా ఇండస్ట్రీల నుంచి కూడా ఆఫర్స్ అందుకుంటూ అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది అనసూయ. కాంట్రవర్సీకి దూరంగా ఉంటేనే లైఫ్ లో ఎదుగుతామని ఇప్పటికి తెలుసుకున్నట్టుంది ఈ అమ్మడు.