English | Telugu

దిమ్మతిరిగేలా 'డ్యూడ్' బిజినెస్.. దీపావళి విన్నర్ ఎవరు..?

ఈ దీపావళికి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అందులో మూడు తెలుగు సినిమాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. నేడు(అక్టోబర్ 16) 'మిత్ర మండలి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ ఫిల్మ్.. బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే. రేపు(అక్టోబర్ 17) 'తెలుసు కదా', 'డ్యూడ్' విడుదలవుతున్నాయి. అక్టోబర్ 18న 'కె-ర్యాంప్' రిలీజ్ అవుతోంది. అయితే ఈ నాలుగు సినిమాల థియేట్రికల్ బిజినెస్ ని గమనిస్తే.. మిగతా మూడు సినిమాల బిజినెస్ కి దాదాపు రెట్టింపు బిజినెస్ 'డ్యూడ్' చేయడం విశేషం.

ఈ దీపావళి సినిమాల్లో అత్యధిక బిజినెస్ 'డ్యూడ్' చేయగా, 'మిత్ర మండలి' తక్కువ బిజినెస్ చేసింది. 'మిత్ర మండలి' మూవీ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే కనీసం రూ.5.5 కోట్ల షేర్ రాబట్టాలని తెలుస్తోంది. ప్రస్తుత టాక్ ని బట్టి చూస్తే.. ఆ మొత్తం రాబట్టడం కష్టమే. అలాగే, 'కె-ర్యాంప్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్ల షేర్ కాగా, 'తెలుసు కదా' టార్గెట్ రూ.23 కోట్లని సమాచారం. ఇక 'డ్యూడ్' బ్రేక్ టార్గెట్ ఏకంగా రూ.60 కోట్ల షేర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

'మిత్ర మండలి', 'కె-ర్యాంప్', 'తెలుసు కదా' మూడు సినిమాలకు కలిపి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.40 కోట్ల షేర్ అయితే.. ఒక్క 'డ్యూడ్' మూవీ టార్గెట్ రూ.60 కోట్లు కావడం విశేషం. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ గత రెండు చిత్రాలు 'లవ్ టుడే', 'డ్రాగన్' ఘన విజయం సాధించాయి. అందుకే ఇప్పుడు 'డ్యూడ్'కి ఈ రేంజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. మరి ఈ దీపావళి సినిమాల్లో ఏది విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.