English | Telugu

బన్నీ వాసుకి బండ్ల గణేష్ కౌంటర్..!

నిర్మాతలు బండ్ల గణేష్, బన్నీ వాసు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బన్నీ వాసు డిస్ట్రిబ్యూట్ చేసిన 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్.. ఇండస్ట్రీలో మాఫియా ఉందని, జాగ్రత్తగా ఉండాలని హీరో మౌళికి సూచించాడు. అలాగే, అల్లు అరవింద్ పైనా ఆయనకు బ్యాక్ గ్రౌండ్ ఉందంటూ సరదా కామెంట్స్ చేశాడు. ఆ ఈవెంట్ లో బండ్ల స్పీచ్ సోషల్ మీడియాని షేక్ చేసింది. దీనిపై ఇటీవల 'మిత్ర మండలి' మూవీ ప్రమోషన్స్ లో స్పందించిన వాసు.. బండ్ల గణేష్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదని, ఆయన వల్ల ఆ సమయంలో మూవీ టీం అంతా ఇబ్బంది పడిందని చెప్పాడు. అయితే ఇది అంతటితో ఆగిపోలేదు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్.. బన్నీ వాసుని టార్గెట్ చేసినట్టుగా ఉంది.

"అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు... మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు" అని తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ బన్నీ వాసుని టార్గెట్ చేసినట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (Bandla Ganesh Vs Bunny Vas)

బన్నీ వాసు సమర్పకుడిగా వ్యవహరించిన 'మిత్ర మండలి' తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు తమ సినిమాపై కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నారని, వారు తన వెంట్రుక కూడా పీకలేరని వాసు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు 'మిత్ర మండలి' మీద కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ కూడా వేశారు. తీరా చుస్తే, ఈ సినిమాకి దారుణమైన నెగటివ్ టాక్ వస్తోంది. రివ్యూలు, పబ్లిక్ టాక్ అన్నీ నెగటివ్ గానే ఉన్నాయి. ఈ క్రమంలో "అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు" అంటూ బండ్ల చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇది బన్నీ వాసుకి కౌంటర్ లాగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.