English | Telugu

ఓటీటీలో దుమ్ము రేపుతున్న వెబ్‌ సిరీస్‌లివే!

ఇటీవలికాలంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించిన విషయం తెలిసిందే. 2020కి ముందు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతూ ఉండేవి. అప్పుడు కూడా కొన్ని థియేటర్లు సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మాత్రం అప్పుడు లేదు. కోవిడ్‌ కారణంగా దేశంలోని ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఒక ఆశాకిరణంలా కనిపించింది ఓటీటీ. అప్పటివరకు సబ్‌స్క్రిప్షన్‌ లేని వారు కూడా అర్జెంట్‌గా తీసుకున్నారు. దీంతో వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్ని భాషల సినిమాలు, అన్ని జోనర్స్‌ సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లు కూడా ఈ ప్లాట్‌ఫామ్స్‌లో దొరుకుతున్నాయి. ఆ కారణంగా ప్రేక్షకులు ఓటీటీకి ఎడిక్ట్‌ అయిపోయారు. ఇక అప్పటి నుంచి థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే కొన్ని థియేటర్లు మూతపడ్డాయి కూడా.

ఓటీటీ సంస్థలు ప్రేక్షకులు మెచ్చే కంటెంట్‌తో వస్తున్నాయి. వాళ్లు స్ట్రీమ్‌ చేస్తున్న సినిమాలుగానీ, వెబ్‌ సిరీస్‌లుగానీ ఎంతో ఎంగేజింగ్‌గా ఉండడంతో అటు వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తోంది. థ్రిల్లర్‌, హారర్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా చాలా జోనర్స్‌లో రూపొందిన సిరీస్‌లు ప్రేక్షకుల్ని కట్టి పడేస్తున్నాయి. డిఫరెంట్‌ జోనర్స్‌ సినిమాలను తీసుకు రావడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటోంది జియో హాట్‌స్టార్‌. ది నైట్‌ మేనేజర్‌ నుంచి స్పెషల్‌ ఓపీఎస్‌ వరకు ఎన్నో వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకాదరణ పొందాయి. జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న కొన్ని వెబ్‌ సిరీస్‌లు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ వెబ్‌ సిరీస్‌లు ఏమిటో ఒకసారి చూద్దాం.

ది నైట్‌ మేనేజర్‌: ఆదిత్య రాయ్‌ కపూర్‌ నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ బ్రిటిష్‌ స్పై థ్రిల్లర్‌ ఆధారంగా రూపొందించారు. ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే సస్పెన్స్‌తో ఈ సిరీస్‌ ఆకట్టుకుంటోంది. షాన్‌ సేన్‌గుప్తా అనే మాజీ సైనికుడి పాత్రలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ నటించాడు. ఇందులో అనిల్ కపూర్ కూడా ఒక కీలక పాత్ర పోషించారు. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

అంతిమ సత్యం: తమన్నా భాటియా నటించిన ఈ సిరీస్‌.. ఆఖ్రీ సచ్‌ పేరుతో హిందీలో స్ట్రీమ్‌ అవుతోంది.ఈ సిరీస్‌కు అంతిమ సత్యం అనే తెలుగు టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. యదార్థ ఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందింది. క్రైమ్‌ థ్రిల్లర్‌, మిస్టరీ, ఎమోషన్‌.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి. దేశాన్ని కుదిపేసిన ఒక కుటుంబ మరణం నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. ఇందులో తమన్నాతో పాటు అభినవ్‌ ఖురానా, రాణా సహోతా, రాజేష్‌శర్మ నటించారు.

ది ఫ్రీలాన్సర్‌: నీరజ్‌ పాండే నిర్మించిన ఈ సిరీస్‌కు భావ్‌ ధులియా దర్శకత్వం వహించారు. అవినాష్‌ కామత్‌ అనే మాజీ పోలీస్‌ అధికారి చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఉగ్రవాద చెరలో ఉన్న తన స్నేహితుడి కుమార్తెను రక్షించేందుకు ఒక డేంజరస్‌ మిషన్‌ ప్రారంభిస్తాడు అవినాష్‌. ఈ సిరీస్‌లో ఆడియన్స్‌ను థ్రిల్‌ చేసే అనేక అంశాలు ఉన్నాయి. భువన్‌ అరోరా, మోహన్‌లాల్‌, అనుపమ్‌ ఖేర్‌ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది.