English | Telugu

అఖండ 2 చూడటానికి ఎంత మంది అఘోరాలు వస్తున్నారు! ఆ ఏరియా నుంచి ఎంత  

-అఖండ 2 కోసం అఘోరాలు వస్తున్నారా!
-బాలయ్య తో అఘోరా కి బ్రాండ్
-అభిమానుల్లో భారీ అంచనాలు
-ప్రచార చిత్రాలతో క్రేజ్


గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)కాస్తా ఇప్పుడు శివస్తుతుడైన అఘోర బాలకృష్ణ గా మారిపోయాడు. అంతలా అఘోర క్యారక్టర్ తో అభిమానులతో, ప్రేక్షకులతో బాలయ్య కనెక్ట్ అయిపోయాడు. రిలీజ్ కి ముందే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కొంచం కష్టం. ఇక ప్రచార చిత్రాలు చూస్తుంటే అఘోర క్యారక్టర్ కోసమే సీక్వెల్ తెరకెక్కించినట్టుగా అర్ధమవుతుంది. ప్రమోషన్స్ లో బోయపాటి(Boyapati Srinu)మాట్లాడుతున్న మాటలు కూడా అందుకు బలాన్ని ఇస్తుండటంతో ఇప్పుడు బాలయ్య వల్ల అఘోర కి పాన్ ఇండియా వ్యాప్తంగా ఒక బ్రాండ్ ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మూవీ లవర్స్ లో ఒక అరుదైన చర్చ జరుగుతుంది.


అఖండ మొదటి భాగం రిలీజైనప్పుడు కొంత మంది అఘోరాలు హైదరాబాద్(Hyderabad)తో పాటు పలు ప్రాంతాల్లోని థియేటర్స్ లో మూవీ చూసారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. ఆ సందర్భంలో మీడియాతో కూడా అఘోరాలు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు సీక్వెల్ కథ అఘోర క్యారక్టర్ చుట్టూనే తెరకెక్కింది. అఘోర గా బాలయ్య భారతదేశం యొక్క గొప్పతనంతో పాటు సనాతన దర్మం లక్ష్యాన్ని చెప్పబోతున్నాడు.

భారతదేశాన్ని పట్టి పీడుస్తున ఉగ్రవాదులని కూడా ఏరిపారేస్తున్నాడు. టోటల్ గా అఘోర జీవన విధానాన్ని సీక్వెల్ లో చెప్పబోతున్నారు. దీంతో ఎంత మంది అఘోరాలు అఖండ 2(Akhanda 2)చూడటానికి భారత దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ కి వెళ్తారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. కుంభమేళా ని చూపిస్తుండటం, బాలయ్య నివాసం హిమాలయాల్లో ఉంటున్నట్టుగా కూడా అనిపిస్తుండటంతో సదరు ఏరియాస్ నుంచి కూడా అఘోరా లు వస్తారా అనే కామెంట్స్ కూడా కొంత మంది చేస్తున్నారు.


also read: నాలుగు భాషల్లో ఓటిటి కి సిద్ధమవుతున్న రవితేజ.. అసలైన మాస్ జాతర ఇదే

అఘోరాలు భారతదేశ ఉనికి ప్రారంభం నుంచే హిమాలయాలతో పాటు పలు ప్రదేశాల్లో మనుగడ సాగిస్తున్న శివస్తుతులు. నిత్యం శివుడ్ని ఆరాధిస్తూ విశ్వంలో ఉన్న అందరు బాగుండాలనే సనాతన ధర్మాన్ని పాటిస్తుంటారు. వీళ్ళ స్థావరాలు ఎంతో రహస్యంగా ఉంటాయి. అక్కడికి చేరుకోవడం మానవుల వల్ల కాదు. కాకపోతే కుంభమేళా టైంలోను, శివ రాత్రి సమయంలోను, లేదంటే వాళ్ళు నిర్ణయించుకున్న ప్రత్యేక ముహూర్తంలోను వీళ్ళు బయటకి వస్తారు. చెడుపై పోరాటం కూడా శివ స్తుతులైన అఘోరాల లక్ష్యం.