English | Telugu

బాహుబలి ది ఎపిక్ ఎలా ఉంది! థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇదే

- బాహుబలి ది ఎపిక్ పబ్లిక్ టాక్
- ఓవర్ సీస్ టాక్ ఎలా ఉంది
- ప్రభాస్ ఫ్యాన్స్ హంగామ
- ఈవినింగ్ నుంచే బెనిఫిట్ షోస్

మరికొన్ని గంటల్లో 'బాహుబలి ది ఎపిక్'(Baahubali The epic)థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రీ రిలీజ్ లాగా లేదు. ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్నట్టుగానే ఉంది. అక్టోబర్ 31 రిలీజ్ డేట్ అయినా ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. దీంతో థియేటర్స్ దగ్గర ప్రభాస్(Prabhas),రానా(Rana) రాజమౌళి(Rajamouli)ఫ్యాన్స్ తో పాటు బాహుబలి(Baahubali)ఫ్యాన్స్ తో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 రిలీజైన రోజులతో పాటు సదరు చిత్రాలకి వచ్చిన టాక్ ని కూడా గుర్తు చేసుకుంటున్నారు.


బాహుబలి పార్ట్ 1 2015 జులై 10 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో అడుగుపెట్టింది. సిల్వర్ స్క్రీన్ పై ఒక కొత్త లోకం ప్రత్యక్షమవుతుండటంతో షూటింగ్ సమయం నుంచే అభిమానులతో పాటు ప్రేక్షకులు పార్ట్ 1 కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తు వచ్చారు. దీంతో రిలీజ్ రోజు ఎన్నో అంచనాలతో థియేటర్స్ లోకి అడుగుపెట్టారు. వాళ్ళు ఉహించనట్టుగానే ప్రతి షాట్ కి మంత్రముగ్ధులయ్యారు. అభిమానులు, మూవీ లవర్స్ ఆనందం అయితే అంతా ఇంతా కాదు. థియేటర్స్ నుంచి బయటకొచ్చాక వాళ్ళు మాట్లాడుతు మేము తెలుగు సినిమా ప్రేమికులమని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అని ముక్తకంఠంతో చెప్పారు. మూవీ బాగాలేదనే నెగిటివ్ టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అయ్యింది. ఆ న్యూస్ తో చాలా మంది షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత స్లో గా సూపర్ డూపర్ హిట్ దిశగా దూసుకెళ్లింది.

Also Read: బాహుబలి ఎపిక్ ప్రమోషన్స్ కి అనుష్క డుమ్మా.. రెమ్యునరేషన్ ఎంత అడిగింది

ఇక రెండవ భాగం 2017 ఏప్రిల్ 28 న రిలీజ్ అయ్యింది. మొదటి భాగంలో ఉన్న ఎన్నో ప్రశ్నలకి రెండవ భాగంలో సమాధానం రావడంతో పాటు, రాజుగా ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసాడు. కథనం కూడా వేగంగా నడవడంతో, బెనిఫిట్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులని కూడా తన ఖాతాలో భద్రపరుచుకుంది. ఈ నేపథ్యంలో రెండు భాగాలు ఒకే భాగంగా కలిపి బాహుబలి ఎపిక్ గా వస్తుండటంతో మరి ఎపిక్ టాక్ ఎలా వస్తుంది. హిట్టా, ప్లాపా, ఏవరేజ్ నా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఓవర్ సీస్ లో ఆల్రెడీ షోస్ పడ్డాయి. హిట్ టాక్ వచ్చింది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.