English | Telugu

ఆంటీ మళ్ళీ వచ్చేసింది

పెళ్లికి ముందు చాలా మంచి పాత్రలలో నటించిన హీరోయిన్ స్నేహ. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన స్నేహ మళ్ళీ సినిమాల్లో కనిపించడానికి రెడీ అయ్యింది. అయితే పెళ్ళికి ముందు మంచి మంచి పాత్రలతో పాటుగా, కాస్త ప్రేక్షకులకు మతి పోగొట్టే హాట్ హాట్ సీన్ లలో పిచ్చేక్కించేసింది.

అయితే ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తున్న "ఏమిటో ఈమాయ" చిత్రంలో నటిస్తుంది. అదే విధంగా ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న "ఉలవచారు బిర్యానీ" చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత స్నేహ నటించే అన్నీ చిత్రాలు కూడా చాలా చక్కని మంచి పాత్రలు చేసే ఆలోచనలో స్నేహ ఉన్నట్లు తెలిసింది. మరి స్నేహ సావిత్రిలా మంచి పాత్రలు వేస్తుందో లేక మళ్ళీ తన అందాలతో ప్రేక్షకులను పిచ్చేక్కించే పాత్రలు చేస్తుందో త్వరలోనే తెలియనుంది.