English | Telugu

పవన్ పాటకు సెన్సార్ అడ్డు

పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రానికి మొట్టమొదటిసారిగా ఓ సమస్య తలెత్తింది. ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని "బాపు గారి బొమ్మో" పాటలో "ఓల్డు మంకు రమ్మో" అనే పదాలు ఉండడం వల్ల సెన్సార్ సభ్యులు ఈ పదాలను తీసేయాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఈ పాట రాసిన రామజోగయ్యశాస్త్రి, మళ్ళీ కొన్ని మార్పులు చేసి పాటను పూర్తి చేయనున్నట్లు తెలిసింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించాడు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.