English | Telugu

అతడి కోసం సోనాక్షి ఎదురుచూపులు...

క్రిష్‌కు మహేష్‌బాబు డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో చెప్పలేం కానీ.. ఆయన మాత్రం కథ,కథనాలు, నిర్మాతను సిద్ధం చేసుకోవడంతోపాటు.. "చివరాఖరికి" హీరోయిన్‌ని కూడా సెట్ చేసేసుకుని.. సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీగా ఉన్నాడు. మహేష్‌, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న "శివం" అనే చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించనున్నారంటూ చాలా రోజుల క్రితమే వార్తలు రావడం తెలిసిందే.

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సైతం.. "శివం" చిత్రంలో మహేష్‌బాబుతో తాను నటించనున్నానని.. క్రిష్ చెప్పిన కథ తనకు చాలా బాగా నచ్చిందని తన ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత రాకుండా ఉంది. మహేష్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో "ఒన్ నేనొక్కడినే" చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే.. శ్రీనువైట్ల "ఆగడు" మొదలువుతుంది. "ఆగడు" అనంతరం పూరి జగన్నాధ్ చిత్రం మొదలవుతుంది. ఈ మూడు చిత్రాలు పూర్తయ్యేసరికి మినిమం రెండేళ్లు పడుతుంది.

మరి మహేష్, క్రిష్, సోనాక్షి కాంబినేషన్‌ సినిమా ఎప్పుడు మొదలువుతుందే ఏమో?